రామన్ పాడు పంప్ స్టేషన్ మిషన్ భగీరథ పైప్ లైన్ లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.     తేది:20.12.2021. వనపర్తి.

ఇంటింటికీ త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం జరిగిందని, ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు నీటి సరఫరాపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం మదనపుర్ మండలంలోని రామన్ పాడు పంప్ స్టేషన్ ను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రామన్ పాడు పైపులైన్లు పరిశీలించి, దీని ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, త్రాగునీరు అందించుటలో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, వాటర్ ట్యాంకులు అక్కడ అక్కడ ఏవైనా మరమ్మతులు అవసరమైతే జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి గ్రామాలలో స్వచ్ఛమైన మంచినీరు అందించుటలో ఎలాంటి అలసత్వం వహించ రాదని ఆయన సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట విద్యుత్తు శాఖ ఎస్. ఈ, మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post