రామన్ పాడ్ పైప్ లైన్ ద్వార నీటిని విడుదల చేసిన రాష్ట్ర వ్యవసయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రిక ప్రకటన
తేది 26-5-3023
వనపర్తి జిల్లా
వనపర్తి పట్టణానికి తాగు నీటి సమస్య ఈరోజుతో తీరుతుందని రాష్ట్ర వ్యవసయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుంపుగట్టు వద్ద రామన్ పాడ్ నుండి గోపాల్ పేట వెళ్ళే మంచినీటి పైప్ లైన్ నుండి బైపాస్ ద్వారా వనపర్తి పట్టణానికి 6 యం.ఎల్.డి పైప్ లైన్ కు వాల్వ్ ఇప్పి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి పట్టణానికి రామన్ పాడ్ వాటర్ పాత పైప్ లైన్ ను వాడటం వల్ల పట్టణంలో తాగు నీటికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాకు రూ.300 కోట్ల నిధులతో మిషన్ భగీరథ అడిషనల్ ప్రాజెక్ట్ మంజూరు చేశారని అది దాదాపు పూర్తి కావచ్చింది అన్నారు. మరో 15 రోజుల్లో ఈ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయి వనపర్తి పట్టణం తో పాటు అన్ని గ్రామాలకు పుష్కలంగా తాగునీరు అందుతుందని తెలియజేశారు. వనపర్తి పట్టణానికి అయితే ఈ రోజు తో తాగునీటి సమస్య తీరుతుందని పేర్కొన్నారు.
ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట పాల్గొన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి ద్వారా జారీ.

Share This Post