slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి. – Information and Public Relations Department, Government of Telangana

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి.

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి.

ప్రెస్ రిలీజ్.

తేదీ 30 .11.2022.

ములుగు జిల్లా.

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి. కె. శ్రీదేవి.

బుధవారం వెంకటాపుర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవి సందర్శించారు.

రామప్పలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవి తో కలిసి సందర్శించారు

వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఆలయ గైడ్‌ ద్వారా రామప్ప శిల్ప కళా సౌందర్యాన్ని తెలుసుకున్నారు.

గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్ వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రామప్ప చెరువు ప్రత్యేకత తో పాటు ఉపాలయాల పరిరక్షణకు, నిర్మాణాలకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

ఆర్ధిక కార్యదర్శిటి కే శ్రీదేవి , కలెక్టర్ రామప్ప చెరువులో బోటింగ్ చేస్తూ

పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి కే శ్రీదేవి మాట్లాడుతూ రామప్ప చెరువు కట్టపైనున్న ఆలయాలతో పాటు రామప్ప ఆలయానికి పశ్చిమ భాగంలో ఉన్న కాలభైరవుడి ఆలయాన్ని సందర్శించి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి దాని కంప్లీట్ డిపిఆర్ పంపించాల్సిందిగా రాష్ట్ర పురవాస్తు శాఖ అధికారులకు ఆదేశించారు. రామప్ప కట్టడం అద్భుతమని పేర్కొన్నారు

ఆలయ మండపంలో వారిని అర్చకులు శాలువాలతో సన్మానించి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు.

రామప్ప ఆలయ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆమె కాసేపు ముచ్చటించారు. రామప్ప విశిష్టత అందరూ తెలుసుకొని ప్రతి విద్యార్థి ఒక ఆర్టికల్ రాసి తనకు పంపించాల్సిందిగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీలు నర్సింగ్, మల్లు నాయక్, ఉమ్మడి జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అస్సిటెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, తహసిల్దార్ మంజుల, టూరిజం కార్పొరేషన్ మేనేజర్ అశోక్, ఏఎస్సై కృష్ణయ్య, టూరిజం రెవెన్యూ పోలీస్ తదితరులు పాల్గొన్నారు.                                     

Share This Post