*రామప్ప లో ఆకట్టుకున్న జానపద, కూచి పూడి నృత్య ప్రదర్శన *

 

వార్త ప్రచురణ

ములుగు జిల్లా  వెంకటాపూర్

26.09.2021.

ప్రపంచ పర్యటన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధిచెందిన ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఆదివారం రోజున పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రామప్ప హెరిటేజ్ టూర్ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు శాస్త్రీయ నృత్య సంబరాలు అంబరాన్ని అంటాయి. రామప్ప యునెస్కో గుర్తింపు భాగంగా వీక్షించడానికి విచ్చేసిన పర్యాటకుల మధ్య కోలాహలంగా కూచిపూడి శాస్త్రీయ నృత్యం మరియు జానపద నృత్యాలతో ప్రముఖ నృత్యకారిణి తాండూరు రేణుక శిష్యబృందం చిన్నారుల నృత్యం అభినయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షించాయి. రామప్ప ప్రధాన ద్వారం ప్రాంగణంలో గార్డెన్ లో నిర్వహించిన పర్యాటక హెరిటేజ్ టూర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోవిడ్  నిబంధనల పాటిస్తూ ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్  జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరిగినది.  ములుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహ్మద్. పాలంపేట గ్రామ సర్పంచ్ రజిత. రామప్ప దేవాలయం ఈవో,  సంబంధిత  శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ ఎస్.ఐ    రమేష్ పర్యవేక్షణలో పోలీస్ శాఖ వారు బందోబస్తు నిర్వహించారు.

Share This Post