రామాయణ కావ్య కర్త, ఆది కవి మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర మనిషిలో మార్పుకు నిదర్శనమని, ప్రతి మనిషిలో మార్పు రావాలని, చెడు ను వదిలి మంచి దారిలో వెళ్లాలని శాసనమండలి ప్రోటైమ్ చైర్మన్ వి. భూపాల్ రెడ్డి పేర్కొన్నారు

రామాయణ కావ్య కర్త, ఆది కవి మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర మనిషిలో మార్పుకు నిదర్శనమని, ప్రతి మనిషిలో మార్పు రావాలని, చెడు ను వదిలి మంచి దారిలో వెళ్లాలని శాసనమండలి ప్రోటైమ్ చైర్మన్ వి. భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.

మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వాల్మీకి జయంతి ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయవాడైన వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించిన గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి తెలుసన్నారు.
మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ఆయన స్ఫూర్తితో ఆదర్శవంతంగా ఎదగాలన్నారు.

వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశం జిల్లాలో వాల్మీకి భవనం, వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని భూపాల్ రెడ్డిని కోరగా, అట్టి విషయాన్ని జిల్లా మంత్రి , ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి వాల్మీకి విగ్రహ ప్రతిష్టకు, భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కేశూరాం, వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశం, జిల్లా అధ్యక్షులు పండరి, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ, బీసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశాంత్ యాదవ్, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిహర కిషన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గోలి యాదవ్, గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్ ప్రకాష్, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఆకాశ వేణి, రజక సంఘం జిల్లా కన్వీనర్ నామాల నగేష్, వీర శైవ లింగాయత్ సంఘం జిల్లా అధ్యక్షులు సిద్దేశ్వర్, ఆరెకటిక జిల్లా అధ్యక్షులు రాందాస్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ చారి, ప్రజలు, బీసీ అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Share This Post