రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాప్‌కు అందరికి వందశాతం వ్యాక్సినేషన్‌ వేయించాలని కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులకు ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ సూచించారు.

పత్రికా ప్రకటన                                                                                       తేది: 03-09-20 21

 రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాప్‌కు అందరికి వందశాతం వ్యాక్సినేషన్‌ వేయించాలని కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులకు ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ సూచించారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపధ్యంలో వాటి పనితీరు, సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులు ,జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీపీవోలు పాల్గొన్నారు. పాఠశాలలకు హాజరైన విద్యార్ధుల శాతం, టీచర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పై  ఆరా తీశారు. అలాగే స్కూల్‌ బస్‌ డ్రైవర్లకు మధ్యాహ్నభోజన సిబ్బందికి, పారిశుధ్ద్యం పనులు చేసే వారికి కూడా వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర స్టాఫ్‌ అందరూ వ్యాక్సినేషన్‌ వేసుకున్నట్టు తెలిసేలా ప్రతి పాఠశాల వద్ద బ్యానర్‌లను కట్టాలని అన్నారు. ప్రతి పాఠశాలలోనూ కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని తరగతి గదులను ప్రతి రోజూ శుభ్రం చేయించాలన్నారు. పాఠశాలలోని ఏ విద్యార్ధికైనా, స్టాఫ్‌కైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరిలించి కోవిడ్‌ పరీక్షలు చేయించాలని సూచించారు. ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలు ఉంటే వెంటనే వారిని ఐసొలేషన్‌కు తరలించాలన్నారు.

జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  మాట్లాడుతూ జిల్లా లో పాటశాల టీచర్లకు 85 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసామని,  పాఠశాలలకు హాజరైన విద్యార్ధుల శాతం తక్కువ ఉందని , ఇతర స్టాఫ్ అందరికి 90 శాతం  వ్యాక్సినేషన్‌ పూర్తి అయిoదని తెలిపారు. పిల్లల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యాహ్న భోజన పంపిణీలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.   

ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ స్సెఫల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌సుల్తానియా, ఆరోగ్యవాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, పంచాయితీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌ రావు, బోర్డ్‌ ఆఫ్‌ ఇండర్‌మీడియట్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేన, డైరెక్టర్‌ పబ్లిక్‌హెల్త్‌ శ్రీనివాస్‌ రావు , జిల్లా నుండి అదనపు కలెక్టర్ శ్రీహర్ష,  వైద్య అధికారి చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–  జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారి  చేయబడినది

Share This Post