రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులలో కూడా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ ఆర్థిక చేయూత నిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 12 ఖమ్మం :

రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులలో కూడా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తూ ఆర్థిక చేయూత నిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య కారణాలతో వైద్య చికిత్సలు చేయించుకున్న అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యుల ప్రత్యేక చొరవతో 35 మందికి (సి.ఎం.ఆర్.ఎఫ్) ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 12.46 లక్షల రూపాయల విలువైన చెక్కులను గురువారం వీడియోస్ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 7 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని 1781 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, నగర పాలక సంస్థ కార్పోరేటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post