రాష్ట్రంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో ముందుస్థానంలో దూసుకెళ్తోంది, తెలంగాణ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు కల్పించి చరిత్ర సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది, దీన్దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ పురస్కారాలకు 27 గ్రామపంచాయతీలు ఎంపిక కావడం ఆనందకరం, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,

పత్రిక ప్రకటన –1 తేదీ : 28–03–2023,
==========================================

కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం జిల్లాస్థాయి జాతీయ పంచాయతీల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
జిల్లా నుంచి అవార్డులకు ఎంపికైన 27 గ్రామపంచాయతీలకు సన్మానాలు,జ్ఞాపికలు అందచేసిన మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్,
తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో ఎంతో ముందుకు దూసుకెళ్తోందని ఈ విషయంలో జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ధీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులకుగాను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని 27 గ్రామ పంచాయతీలు తొమ్మిది విభాగాల్లో జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయా గ్రామపంచాయతీలకు సన్మానోత్సవాలు, జ్ఞాపికల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి చరిత్ర సృష్టిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామపంచాయతీల్లో ప్రతి గ్రామానికి పల్లె ప్రగ తి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం, ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి దేశంలోనే మంచి చరిత్ర సృష్టించామని ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రతినిత్యం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కార్యక్రమాలను చేపడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లెను ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరిగిందని ఇది ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడి కొనియాడారు. అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల అవార్డులకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నుంచి తొమ్మిది విభాగాల్లో 27 గ్రామాలను ఎంపిక చేయడం అవార్డులు రావడం వాటిని అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో జిల్లా మకుటాయమానంగా నిలిచిందని ఈ విషయంలో ఆయా విభాగాల్లో ఎంపికైన వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేస్తే అనుకన్న లక్ష్యాన్ని సాధించడం జరుగుతోందని ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధిపథంలో తీసుకెళ్ళేందుకు అందరూ సహకరించాలన్నారు. గ్రామాల అభివృద్ధి ఎంతో కీలకమని ముందుగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మరింత అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొందని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం , దళిత బంధు ,గృహ లక్ష్మి , కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, , కేసీఆర్ కిట్ వంటివి అందించడంతో పాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అండగా నిలుస్తోందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. జిల్లాను ఇదే తీరుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని మరింత బాధ్యత పెరిగిందని దీనికి అందరి సహకారం ఎంతో అవసరమని మంత్రి మల్లారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జడ్పీ సీఈవో దేవసహాయం ,జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, , జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, ఎంపీడీవోలు, , పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post