రాష్ట్రంలో మొదటిసారిగా పంట నష్ట పరిహారపు చెక్కుల పంపిణీ :: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు – నర్సంపేటలో చెక్కుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే పెద్ది, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య … – ఉగాది పండుగ అనంతరం నియోజకవర్గంలో క్లస్టర్ వారిగా కొనసాగనున్న నష్టపరిహారం చెక్కుల పంపిణీ- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి .. – రైతులను ఆదుకోవడంలో ఘనుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ .

వరంగల్

ప్రచురునార్ధం

రాష్ట్రంలో మొదటిసారిగా పంట నష్ట పరిహారపు చెక్కుల పంపిణీ :: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

– నర్సంపేటలో చెక్కుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే పెద్ది, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య …

– ఉగాది పండుగ అనంతరం నియోజకవర్గంలో క్లస్టర్ వారిగా కొనసాగనున్న నష్టపరిహారం చెక్కుల పంపిణీ- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ..

– రైతులను ఆదుకోవడంలో ఘనుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ .

*- త్వరలో నర్సంపేటకు సీఎం కేసీఆర్ రాక.
——————————————-

గత సంవత్సరం 2022లో కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెక్కులను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , స్థానిక నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి , వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా పంపిణీ ప్రక్రియను ప్రారంభం చేయడం జరిగింది..

_ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…_

– ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వానకు వేల మంది రైతులు నష్టపోవడం జరిగింది.
– ఇంత జరిగిన కేంద్రం పట్టించుకోక పోవడం చాలా దురదృష్టకరమన్నారు ….

– వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేటలోనే పెద్ద ఎత్తున నష్టం జరగడం జరిగిందన్నారు

– మొత్తం 1,11,235 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని ..
71 వేల మంది రైతులు నష్టపోవడం జరిగిందన్నారు
– మన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ఒక్కమన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప…

* జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడానికి మనసున్న మారాజు మన సీఎం కేసీఆర్ త్వరలో నర్సంపేటకు రానున్నారని తెలిపారు

– నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కింద చెక్కులను ఇవ్వడం ఈ రోజు నర్సంపేట నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగిందన్నారు
– ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఈరోజు చెక్కులను ఇప్పించిన కృషి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దక్కుతుందన్నారు .
– నష్టపోయిన ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి కచ్చితంగా నష్టపరిహారం అందజేస్తమన్నారు .

– ప్రతి రైతు భూమి వద్దకు వెళ్లి నష్టపోయిన పంట వివరాలను సేకరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

– రైతులకు అందించాల్సిన నష్టపరిహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తిలో ఇవ్వాలని….
– కానీ కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదు దానితో నష్టపరిహారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు అందించిందన్నారు

– వ్యవసాయ శాఖా అధికారులతో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతుల పంట వివరాలు కలెక్టర్ సమర్పించామని
– అందులో ముఖ్యంగా వ్యవసాయ శాఖ కింద మొత్తం 1874 హెక్టార్ల పంట (అన్ని రకాల) నష్టానికి గాను 3712 మంది రైతులకు రూ.1,56,16,302/-…
– అదేవిధంగా ఉద్యానవన శాఖ కింద 5265.81 హెక్టార్ల పంట నష్టానికి గాను 12417 మంది రైతులకు రూ. 7,10,88,435/- విలువ గల చెక్కులను పంపిణీ చేయనున్నారని తెలిపారు .
– మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, జిల్లా మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గ రోడ్ల మరమ్మత్తు కోసం రూ.64 కోట్లతో ప్రత్యేకమైన జీవో తీసుకురావడం జరిగిందని…
– ఎలాంటి పక్షపాతం లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ కి
నా ధన్యవాదాలు తెలిపారు

జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ

జి. ఓ RT నెంబర్ 42 ప్రకారం గత సంవత్సరం అకాల వర్షం వల్ల నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం కింద
8,89,43,054 రూపాయలు మంజూరు అయ్యిందన్నారు

ప్రతీ ఒక్కరికి చెక్కులు అందచేస్తామన్నారు

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటల వివరాలను సమగ్రం గా తీసుకోని ప్రభుత్వాని కి పంపిస్తామన్నారు

నష్ట పరిహారాన్ని తెలుసుకోవడానికి మండలాల వారీగా అగ్రికల్చర్, హార్టికల్చర్, రెవెన్యూ వాళ్ళను ఒక బృందం గా ఏర్పాటు చేసామని… వారం పాటు టీం సభ్యులు ప్రతీ గ్రామం కి వచ్చి నష్టాన్ని తెలుసుకుంటారన్నారు

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్, జెడ్పి ఫ్లోర్ లీడర్, ODCMS చైర్మన్, JD అగ్రికల్చర్, AD హార్టికల్చర్, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, PACS చైర్మన్లు, RSS రాష్ట్ర డైరెక్టర్లు, కన్వీనర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, AO లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post