పత్రికా ప్రకటన. తేదీ:22-01-2022
రాష్ట్రం లో దళితుల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన దళిత బంధు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అన్ని జిల్లాల కల్లెక్టర్లతో దళిత బంధు కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్య మంత్రి గారి ఆదేశాల మేరకు ధలితబందు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం 100 మంది దళితులకు పథకం అమలు చేయాలని సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని పూర్తి చేయుటకు గ్రౌండ్ లెవెల్ లో లబ్ధిదారులను ఎంపిక చేసుకొని లక్ష్యం మేరకు లబ్ది చేకూర్చలన్నారు. దళిత బంధుతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని, జిల్లాలో దళిత బందు అమలుకు అవసరమైన కమిటీలు ఎర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని త్వరగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నిరుపేద దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఫిబ్రవరి 5 లోపు ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక , మార్చి 7లోపు యూనిట్ల గ్రౌండ్ పూర్తి పూర్తి చేయాలనీ, అధికారులకు ఆదేశించారు.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ దళిత బంధు ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరు సమన్వయము తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. జూలై నెల వరకు వంద శాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలనీ, స్థానిక శాసనసభ్యుల తో చర్చించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ను పూర్తీ చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కమిటీ ఏర్పాటు చేయాలనీ, దళిత బంధు కొరకు స్పెషల్ బ్యాంకు అకౌంట్ ఉందని తెలిపారు. జిల్లాలో సీనియర్ అధికారులు, జిల్లా కల్లెక్టర్లు సమన్వయముతో ఎలాంటి సమస్యలు లేకుండా గ్రౌండింగ్ పూర్తి చేసి, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ లబ్దిదారులను ఎంపిక చేయాలనీ ప్రతి కుటుంబానికి దళిత బంధు చేరేలా చూడాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ దళిత బంధు అమలు పై జిల్లాలో రెండు నియోజిక వర్గాల శాసన సభ్యులతో, జిల్లా అధికారులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. కమిటీ ని ఏర్పాటు చేసి లబ్దిదారులను గుర్తిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 7 లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, ఎస్సి సంక్షేమ శాఖ అధికారి శ్వేత, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి రమేష్ బాబు, పశు సంవర్థక శాఖ ఎ.డి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారీ చేయడమైనది.