రాష్ట్రం లో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లకు, సంబంధిత అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రం లో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లకు, సంబంధిత అధికారులకు ఆదేశించారు.

గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసి  పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించలేదని ఈ సంవత్సరం రాష్ట్రం లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రత్యేక పరిస్థితులలో పరిక్షలు  రాయబోతున్నారని,  ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి ఉషోగ్రతలు అధికం అవుతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలతో పాటు త్రాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఎ.ఎన్.ఎం , ఆశా వర్కర్ ఉండాలని,  పరీక్ష కేంద్రాలలో సి.సి. కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని , సి.సి. కెమెరాల పర్యవేక్షణ లోనే పరిక్షలు నిర్వహించాలని అన్నారు. పరీక్షా సమయం లో నిరంతర విద్యుత్ సరపరా ఉండేవిధంగా చూడాలని, విద్యార్థులు సమయానికి పరిక్ష కేంద్రానికి చేరుకునే విధంగా బస్సులను ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాలలో స్పెషల్ బస్సులను నడిపించాలని , విద్యార్థులు పరిక్ష సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి ముందుగా తెలియజేయాలని , పరీక్ష అనంతరం విద్యార్థులు ఇంటికి క్షేమంగా చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.  జిల్లా కలెక్టర్లు రవాణ, పోలీస్, రెవిన్యూ, వైద్య శాఖల అధికారులు, మరియు ప్రిన్సిపల్స్ అప్రమత్తంగా ఉండే విధంగా వారికి సూచనలు జారు చేయాలనీ అన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే  1800-599-9333 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని  తెలిపారు.

రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పరిక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, కేంద్రాల లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదని, పరిక్ష కేంద్రాలలో ఉన్న సిసి కెమెరాలు పని చేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలని, ఏమైనా రిపేర్ లు ఉంటే చేయించి పరీక్షలకు ముందే అన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని , త్రాగు నీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్ లను ఏర్పాటు చేయాలనీ అన్నారు.

 

వనపర్తి జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జోగుళాంబ గద్వాల్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ యాస్మీన్ బాష  మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో పదవ తరగతి పరిక్షలు రాసే విద్యార్థులు 8041, ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరిక్షలు రాసే విద్యార్థులు మొత్తం 8358 ఉన్నారని,  41 పదవ తరగతి పరీక్ష కేంద్రాలు, 14 ఇంటర్మీడియేట్ పరీక్షా కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు. ఈ నెల 25 వ తేదిన సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని , విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా బస్సులను నడపడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా తో పాటు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు తో పాటు 144 సెక్షన్ ను అమలు చేస్తామని, పరీక్షా సమయాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని , పరిక్షల నిర్వహణ కు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిక్షలు సజావుగా నిర్వహిస్తామని    తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో,  జిల్లా నుండి ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయ రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్, జిల్లా విద్య శాఖ అధికారి సిరాజ్జుద్ధిన్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబగద్వాల్ గారి చే  జారీ చేయబడినది.

 

 

 

Share This Post