రాష్ట్రపతి రాక నేపథ్యంలో అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరీశ్ సమీక్ష

రాష్ట్రపతి రాక నేపథ్యంలో అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ హరీశ్​ సమీక్ష

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్​ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​ అన్నారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శీతాకాల విడిది కోసం హైదరాబాద్​లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి ఈనెల 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఉండనున్నందున అందుకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారుతో జిల్ల్లా కలెక్టరేట్​లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీశ్​ మాట్లాడుతూ ప్రతియేడు మాదిరిగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఈనెల 29వ  తేదీన హకీంపేట ఎయిర్​పోర్టులోకి వచ్చి అక్కడ నుంచి బొల్లారం చేరుకుంటారని అనంతరం జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలో ఉంటారని  వివరించారు. రాష్ట్రపతి రానున్న సందర్భంగా ఆయన పర్యటనను   హైదరాబాద్​కు మరింత గుర్తింపు వచ్చి ఇనుమడింపచేసేలా అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వహించాలని ​ తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హకీంపేట విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్​ మల్లికార్జున్​రావుకు కలెక్టర్ వివరించారు. ఈ మేరకు విమానాశ్రయంలో అంబులెన్స్​ అందుబాటులో ఉంచడంతో పాటు ఆర్టీపీఎస్​ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని ఈ మేరకు కలెక్టర్​ హరీశ్​ ఆదేశించారు. అలాగే హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతితో పాటు మరికొందరు వీఐపీలు వెళ్ళనున్నందున రోడ్లు ఎలాంటి గుంతలు, గతుకులు లేకుండా చూడాలని అందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి రోడ్లను బాగు చేయాలని దీంతో పాటు షామియానాలు (టెంట్లు), కుర్చీలు, సభావేదికకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ అధికారి శ్రీనివాస్ మూర్తి కి సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్​ హరీశ్​ స్పష్టం చేశారు. మున్సిపల్​ అధికారులు సైతం ఎక్కడ కూడా చెత్త కనబడకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సంబంధిత కమిషనర్​కు సూచించారు  అలాగే విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకుగాను అవసరమైన మరమ్మతులు, చర్యలు తీసుకొని నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరాను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ట్రాన్స్​కో అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్​, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​,. ఆర్డీవోలు రవి, మల్లయ్య.  ఆయా శాఖల జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్తు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post