రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు జిల్లా కలెక్టర్ అభినందన

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు జిల్లా కలెక్టర్ అభినందన

000000

     క్రీడా విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న దివ్యాంగులని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అభినందించారు.

    అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అవార్డులు అందించింది. ఈ క్రమంలో క్రీడా విభాగంలో ప్రతిభ కనబరిచిన వికలాంగుల కోటా కింద జిల్లాకు చెందిన మహమ్మద్ ఫరూక్ అహ్మద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఫరూక్ వీల్ చైర్ క్రికెట్ విభాగంలో తెలంగాణ తరఫున కెప్టెన్ గా ఉన్నారు. కరీంనగర్ నగరానికి చెందిన ఫరూక్ స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డుకు ఎంపిక కావడంతో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఫరూక్ ను అభినందించారు. జిల్లాస్థాయి వికలాంగునికి అవార్డు రావడం పట్ల జెడ్పీ సీఈవో ప్రియాంక, అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, సూపరిండెంట్ శ్రీనివాస్, దివ్యాంగుల సంఘం బాధ్యులు వెన్నెం శ్రీనివాస్, జక్కం సంపత్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక ,మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఆర్డిఓ ఆనంద్ కుమార్ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post