రాష్ట్రస్థాయి సంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన జిల్లా విద్యార్థులు – సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్

మంగళవారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రంలోని 33 జిల్లాల బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీల్లో నాగర్ కర్నూలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విద్యార్థులు నిర్వహించిన భారత్ మాతాకీ జై అనే విద్యార్థుల నృత్యానికి ప్రథమ బహుమతి లభించిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ బుధవారం తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల విద్యార్థులతో పోటీపడి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రులకు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఎంతగానో ఆకట్టుకుంటాయని విద్యార్థులను కొరియోగ్రాఫర్ తిరుపతయ్య ను అభినందించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం లు ప్రథమ బహుమతి సాధించిన నాగర్ కర్నూలు జిల్లా విధ్యార్థులకు ప్రథమ బహుమతి ని బీసీ వెల్ఫేర్ అధికారి, ప్రకాష్, విద్యార్థులు అందుకున్నారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ మాట్లాడుతూ, జిల్లా లో విద్యాతో పాటు సాంస్కృతిక కళారంగంలో ను బిసీ విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు.
విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించి వారిని నాసా వరకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.
వీరిలో విద్యతో థింకింగ్, కెపాసిటీ బిల్డింగ్, అంతర్గత నైపుణ్యాల్ని వెలికితీసి పెంచడంతో పాటు వారి తో ముఖాబివ్రుద్ది కోసం రాష్ట్రస్థాయి చరిత్రలోనే తొలిసారిగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుపొందడం ఎంతగానో ఆనందంగా ఉందని విద్యార్థులను తీర్చిదిద్దిన వార్డెన్లు, కొరియోగ్రాఫర్ లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీధర్ జి, వివిధ వసతిగృహాల వార్డెన్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Share This Post