రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

నారాయణ పేట జిల్లా నుండి తేదీ 5  నుండి 7 నవంబర్ వరకు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్స్ సాఫ్ట్ బాల్  పోటీలలో క్రీడాడాకారులు పాల్గోని రజత పతకాలు సాధించి0చారు. రజిత పతకం సాధించిన వారిలో సాదిక్ మరియు వెంకటేష్ గుండు మాల్ గ్రామానికి చెందినవారు ఉన్నారు. వీరు రోజు సాఫ్ట్ బాల్ ఆటలో శిక్షణ తీసుకుని రాష్ట్రస్థాయి పోటీలలో రజత పతకం పొందినారు వీరిని మన జిల్లా గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రారెడ్డి  గారు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారు సాధించిన విజయాన్ని అభినందిస్తూ మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేశారు అలాగే ముందు ఇంకా ఈ ఆటలో నిష్ణాతులు అవ్వాలని కోరుత, మొదటి స్థానం సాధించాలని చెప్పడం జరిగింది మరియు జక్లేర్ గ్రామాలలో  రోజు శిక్షణ తీసుకుంటు ఈ స్థాయికి ఎదిగారు. ఈ అలాగే నారాయణపేట జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గందె చంద్రకాంత్ గారు, AMO విద్యాసాగర్ గారు, స్పోర్ట్స్ ఇంచార్జ్ సాయినాథ్ గారు వీరిని అభినందించారు

Share This Post