రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లో ప్రముఖ అంతర్జాతీయ వెటరన్ స్విమ్మింగ్ క్రీడాకారిణి శ్రీమతి గోలి శ్యామల ని అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… హైదరాబాద్ కు చెందిన గోలి శ్యామల అంతర్జాతీయ స్థాయి వేదికలపై వెటరన్ స్విమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు. మన దేశం – శ్రీలంక దేశాల మధ్య ఉన్న హిందు మహా సముద్రంలో ఉన్న పాక్ జల సంధి (30 కిలోమీటర్లు) ను ఈదిన రెండో మహిళ గా చరిత్ర సృష్టించారన్నారు మంత్రి .
అదే స్పూర్తితో ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకరావలనే లక్ష్యం తో ఎంతో ప్రమాదకరమైన, అత్యంత కోల్డ్ వాటర్ కలిగిన, లోతైన ప్రాంతమైన కేటాలిన ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు (సుమారు 36 కిలోమీటర్లు) జరిగే స్విమ్మింగ్ అడ్వెంచర్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్తునందుకు మంత్రి అభినందించి, సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోచ్ ఆయుష్ యాదవ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేష్ పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Share This Post