రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (Telangana Akadamy for Skill And Knowledge) TASK – CEO శ్రీ శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాస్కర్ గార్లు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (Telangana Akadamy for Skill And  Knowledge) TASK – CEO శ్రీ శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాస్కర్ గార్లు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రంలో TASK సంస్థ ద్వారా ఇంజినీరింగ్, డిప్లమా, డిగ్రీ, PG చదువుతున్న విద్యార్థుల కు అందిస్తున్న ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు  అవసరమైన శిక్షణను  అందిస్తున్నామని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారికి TASK CEO వివరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో 32 కళాశాలల నుండి సుమారు 7600 మంది ఇంజినీరింగ్, డిప్లమా, డిగ్రీ, PG చదువుతున్న విద్యార్థుల కు, శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత TASK మరియు అనుబంధ సంస్థలలో ఉద్యోగానికి, ఉపాధికి అవసరమైన శిక్షణ తో పాటు  పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ , ఔత్సాయిక పారిశ్రామికవేత్తలు గా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ లను ఇస్తున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కొంత మంది అభ్యర్థులకు వివిధ కంపెనీలలో నియమాకాలు పొందారని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారికి వివరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, మంత్రి శ్రీ KTR ల ప్రత్యేక చొరవ తో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో 400 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా IT పార్క్ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ IT పార్క్ లో TASK సంస్థ కు సుమారు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కు శాశ్వత ప్రాతిపదికన IT టవర్ లో ఆఫీసు ను  కేటాయించారు. ఈ శిక్షణ కేంద్రం ను అక్టోబర్ – 22లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఆధునిక శిక్షణ కేంద్రం తో పాటు, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ, ఉపాది రంగంలో సేవలు అందిస్తున్న యువతను ఔత్సాయిక  పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దాలా కార్యాచరణ ను రూపొందించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు TASK అధికారులను ఆదేశించారు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం గా మహబూబ్ నగర్  TASK కేంద్రం ను తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో TASK, T STEP ల ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి  నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యం గా  కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ MD లతో TASK అధికారులతో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం ను నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

Share This Post