రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి జిల్లా ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన,
తేదీ :- 27.05.2023.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి జిల్లా ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరెట్ మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.

జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ,అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే హనుమకొండ జిల్లా ఏర్పాటు, అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన హనుమకొండ జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పులను తెలియ చెప్పాలని అన్నారు. జిల్లా వైద్య రంగం లో సాధించిన ప్రగతిని, కంటివేలుగు, కెసిఆర్ కిట్, ఆరోగ్యశ్రీ సేవలు తెలియచెప్పాలని అన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.

ప్రతి కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తప్పకుండా ఉండాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని, వేడుకలకు ముస్తాబు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, ట్రైనీ IPS అధికారి అంకిత్ శంకువార్, డీసీపీ ఎమ్.ఏ బారి, డిఆర్ఓ వాసు చంద్ర ,ఆర్టీవో పరకాల రాము, డిఎండబ్ల్యూఓ శ్రీను, జిఎం ఇండస్ట్రీస్ హరిప్రసాద్, డిఈఓ అబ్దుల్ హై, డిపిఓ జగదీశ్వర్, DMHO సాంబశివరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, టూరిజం అధికారి శివాజీ, ఏసిపి కిరణ్ కుమార్, హనుమకొండ తహసిల్దార్ రాజకుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post