రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

    రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్  రెడ్డి ముందుగా ఉదయం 8-40 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఉదయం 9-00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ,అనంతరం సందేశం వుంటుందని ఆయన తెలిపారు. అక్కడే ఉదయం 9-30 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారని ఆయన తెలిపారు.
*కవి సమ్మేళనం*:
     సాయంత్రం 6-00 గంటలకు గుండగోని మైసయ్య కన్వెన్షన్ హలులో “తెలంగాణ స్ఫూర్తి” పై కవి సమ్మేళనం ఉంటుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,పుర ప్రముఖులు, పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు

Share This Post