రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

*ప్రజాభివృద్ది సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:: ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్*

*రాష్ట్ర అవతరణ దినొత్సవ వేడుకలలో పాల్గోన్న ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

*పెద్దపల్లి , జూన్ 02:-. ప్రజాభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతుందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో నిర్వహించిన 8వ రాష్ట్ర అవతరణ దినొత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్, పెద్దపల్లి,రామగుండం ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గోన్నారు. జిల్లాలోని ఎంపిడిఓ ఆవరణలో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి, వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వామి మందిరం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆయన గౌరవ వందనం స్వీకరించి జాతీయపతాకావిష్కరణ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతిపై నివేదికను సందేశ పూర్వకంగా ఆయన అందజేశారు. దళిత బంధు, నూతన వైద్య కళాశాల నిర్మాణం, పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి, మన ఊరు మన బడి, మిషన్ భగీరథ, జలహితం, రైతు బంధు, రైతు బీమా ఆసరా పింఛన్లు, విద్యుత్ సరఫరా ,తెలంగాణకు హరితహారం, టీఎస్ ఐపాస్, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను వివరిస్తూ ముఖ్యఅతిథి సందేశం అందించారు.

జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, సీపీ చంద్ర శేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మహిళా కమిషన్ సభ్యురాలు కాటరి రేవతి రావు ,పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఈద శంకర్ రెడ్డి,పెద్దపల్లి మున్సపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు రాష్ట్రా ఆవిర్భావ వేడుకలో పాల్గోన్నారు.

Share This Post