రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -31:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. శశాంక మంగళవారం పరిశీలించారు.

జూన్ 2న జిల్లా కేంద్రంలోని ఎన్.టి.ఆర్. స్టేడియం లో నిర్వహించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పరిశీలించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా, సజావుగా నిర్వహణకు ఏర్పాట్లను కట్టుదిట్టంగా, పకడ్బందీగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అమర వీరుల కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సందర్శకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధుల కూర్చునే విధంగా అనుకూలంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ శాఖాపరంగా స్టాల్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏర్పాట్లను పరిశీలిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, ఏ.ఎస్పి యోగేష్ గౌతం, ఆర్డీవో కొమురయ్య, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, డి.ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, తహసిల్దార్ నాగభవానీ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post