రాష్ట్ర ఆడిట్ శాఖ స్థానిక సంస్థల ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

పత్రికా ప్రకటన నల్గొండ, జనవరి 11. రాష్ట్ర ఆడిట్ శాఖ స్థానిక సంస్థల ఆడిట్ నందు అభ్యంతర పరచిన అపరిష్కృత ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మున్సిపల్ కమిషనర్ లు,ఆడిట్ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం లో పెండింగ్ ఆడిట్ అభ్యంతరాలను సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు.ఈ సమావేశం లో జిల్లా ఆడిట్ అధికారి కృపాకర్ రావు,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post