పత్రికా ప్రకటన తేది 09 -12-2021
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇ వి ఎం ల గోదాముల బౌతిక పరిశీలనను ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ.
గురువారం ఉదయం పి.జె.పి క్యాంపు ఆవరణలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరిచి ఇవియం లు ,వి.వి. ప్యాట్ ల స్ట్రాంగ్ రూంను వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధుల సమక్షంలో పరిశీలించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ తాళం లు తెరిచి గోడౌన్ లో ఉన్నటువంటి ఇవియంలు , వివిప్యాట్ల ను కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్ , వి.వి.ప్యాడ్ లకుఏర్పాటు చేసిన సిబంది బౌతిక పరిశీలన చేయాలని అన్నారు. ఈ.ఎం.ఎస్. సిస్టం యాప్ డౌన్లోడ్ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని అన్నారు. ప్రజా ప్రతి నిదుల సమక్షంలో తాళాలు తెరవటాన్ని ఫోటో, మరియు వీడియో చిత్రీకరణ చేయడం జరిగిందని తెలిపారు.
అదనపు కలెక్టర్ గారితో పాటు సుపరిటెన్డెంట్ మదన్ మోహన్, వై ఎస్ ఆర్ సి పి హతిక్ హుల్ రహమాన్ , టి.ఆర్.ఎస్ సుబాన్, తదితరులు ఉన్నారు.
————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.