రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ మరిపెడ రాక…

రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ మరిపెడ రాక…

మరిపెడ,
మహబూబాబాద్ జిల్లా, జూలై -26 :

రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ సి. పార్థసారథి మంగళవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా మరిపెడకు రాగా, రోడ్లు, భవనాలు శాఖ అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం ఎలక్షన్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

మొదటగా షో గార్డ్ పోలీస్ లు ఎలక్షన్ కమిషనర్ కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎలక్షన్ కమీషనర్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఏ.ఎస్పీ. తో సమావేశమై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎల్. రమేష్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.పి. ఓ. సాయి బాబా, ఎం.పి.డి. ఓ. భావ్ సింగ్, తహసిల్దార్ రాం ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post