వార్తా ప్రచురణ
వరంగల్ 8,మార్చి2023.
రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి హెలికాప్టర్లో విచ్చేసిన వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, పోలీస్ కమిషనర్ రంగనాథ్, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, పూలబోకెలతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్క్రీనింగ్ టెస్ట్ క్యాంప్ కార్యక్రమాన్ని మంత్రివర్యులు ప్రారంభించి, అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను పలకరించి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అనంతరం సభా ప్రాంగణానికి విచ్చేసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏనుగల్ గ్రామ మహిళలకు శాలువా మరియు పుష్పా గుచ్చం తో సత్కరించారు.
ఈ సంధర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో సంప్రదించి ఈ గ్రామానికి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ గ్రామం చుట్టూ ఉన్న తండా ప్రజల కోసం గిరిజన సంక్షేమ హాస్టల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
గడ్డపార తండాకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి కల్పిస్తాం అని అన్నారు.
ఆరోగ్యమే మహా భాగ్యం అని,కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుందని,
ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారని విద్య,వైద్య రంగాలకి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సంధర్భంగా కేటీఆర్ అన్నారు.
అదేవిదంగా రాష్ట్రం లోని 33 జిల్లా లకు…. జిల్లా కు ఒకటి మెడికల్ ఆసుపత్రి కట్టిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కే దక్కుతుందని అన్నారు.
ఈ రోజు నుండి మూడు రోజుల పాటు ప్రతిమ ఫౌండేషన్ వారు కాన్సర్ స్క్రినింగ్ టెస్టులు చేయడం గొప్ప విషయం అన్నారు. డబ్బు ను అందరూ సంపాదించగలరు.. కానీ కొందరు మాత్రమే దానిని మంచి పనుల కోసం ఖర్చు చేస్తారు అని అన్నారు. పుట్టిన ప్రాంతం మీద ఉన్న మక్కువ తోని ప్రతిమ ఫౌండేషన్ వారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యంగా మూడు పనులు మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేయగలిగారని, అవి స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహరం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అవి మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణ నీరు ప్రతీ ఇంటి కి అందిస్తున్నాము, హరితహారం తో 240 కోట్ల మొక్కలను పెట్టి స్వచ్ఛమైన గాలి ని అందిస్తున్నాం, ఎండాకాలం లో కూడా చెరువులు, కాలువలు నిండుగా ఉన్నాయి అని, ప్రతీ వాగు మీద చెక్ డ్యామ్ కనిపిస్తుంది అంటే కెసిఆర్ గారి ఆలోచన విధానం అని అన్నారు.కెసిఆర్ అంటే… k అంటే కాలువలు,C అంటే చెరువులు,R అంటే రిజర్వాయర్ లు అని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ
ఈ గ్రామ ప్రజలకు నేను ఎంత చేసిన తక్కువేనని, ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని, వీరి ఆదరణకి రుణపడి ఉంటాను అన్నారు. ఎవరి సాయం లేకున్నా బాగా ఎదిగి పుట్టిన ఊరు రుణం తీసుకోవాలని అన్నారు.
ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బోయినపల్లి కుటుంబ సభ్యులను అందరినీ అభినందించారు.
నా శక్తి కొద్దీ ఈ గ్రామం కోసం రోడ్డు సదుపాయాలను కల్పించానన్నారు.
మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని, గ్రామాల్లోని మహిళలకు ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల టెస్టులు చేయించుకోవడం లేదన్నారు.
ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని ప్రతిమ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినా ఉచిత మెగా క్యాన్సర్ శిబిరం ఈ ప్రాంత మహిళలకి ఉపయోగకరంగా ఉంటుందని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిగారు అన్నారు
ఏనుగల్ ప్రజల కోసం నేను రోడ్లు ఏర్పాటు చేశానని ,ఇంకా ఆ గ్రామానికి కావలసిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయుటకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అన్నారు.
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు మాట్లాడుతూ కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మూడు రోజుల పాటుగా నిర్వహించడం ఈప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, బోజన వసతులు కల్పిస్తూ గిరిజన ప్రాంత ప్రజలకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా అవసరం అని అన్నారు.
పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ రావు గారు మాట్లాడుతూ రాణి రుద్రమదేవి ఏలిన ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి మహిళ ఎదగాలని, ఇంకా మహిళల్లో సాదికరత రావాలని అన్నారు.
ఈ సంధర్బంగా జిల్లా పరిషత్ చైర్పసన్ గడ్ర జ్యోతి గారు మాట్లాడుతూ మహిళలకు సంబందించిన కాన్సర్ స్క్రినింగ్ టెస్ట్లు ప్రతి మంగళ వారం రోజున నిర్వహించే ఈ టెస్టులను ప్రతి మహిళాలు టెస్ట్ చేసుకునేందుకు ముందుకు రావాలని అన్నారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ మా కుటుంబం ఒక్క పెద్ద దిక్కును క్యాసర్ వల్ల కోల్పోయిందని, ప్రజారోగ్యం పరిరక్షణ ద్యెయంగా మాకుటుంబ సభ్యులందరం కలిసి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజల జీవితాలను కొంత వరకు క్యాన్సర్ నివారణ చేయవచ్చు అనే దృడ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. వరంగల్లు లోనే ఎందుకు ఏర్పాటు చేసాము అనంటే, వరంగల్లు ప్రజలు హైదరాబాదు లో ట్రీట్మెంట్ తీసుకొనుటకు పేషెoట్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లేందుకు ఆర్థికంగా బారం పడుతుందని, ఆర్థిక బారం పడకుండా నివారించుటకు గాను…వరంగల్లు లోనే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలోరాష్ట్ర ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ గారు , MLC బస్వరాజు సారయ్య గారు, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మా రెడ్డి గారు , నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు , తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ గారు , జిల్లా కలెక్టర్ బి.గోపి,పోలీసు కమిషనర్ రంగనాధ్, ప్రతిమ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ రావు, డా.హరిణి, ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అదికారులు, పెద్ద సంఖ్య లో ప్రజలు పాల్గొన్నారు.