రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కే.టి. రామారావు జూన్ 4న కోస్గి పర్యటన సందర్బంగా చేపట్టనున్న ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు

రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కే.టి. రామారావు జూన్ 4న కోస్గి పర్యటన సందర్బంగా చేపట్టనున్న ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కొడంగల్ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తో కలిసి కోస్గిలో మినిష్టర్ రాక సందర్బంగా  సన్నద్ధత కార్యక్రమాలను పరిశీలించారు.

కోస్గి మున్సిపాలిటీ  వార్డ్ నెం 7 లో పంచతంత్ర  పార్క్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సహానికి సిద్ధంగా ఉన్న  శ్మశాన వాటిక, మున్సిపల్ భవనం, కూరగాయల మార్కెట్  ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని   ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మొక్కలు నాటాలని  ఆదేశించారు. స్మశాన వాటిక  లోని ఖాళీ స్థలంలో మొక్కలు  అధికంగా నాటాలని సూచించారు. అలాగే బస్ డిపో ను పరిశీలించి  మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.  ఇంటిగ్రేటెడ్ పార్క్ కై ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించి శంకుస్థాపనకు సిద్ధంగా ఉంచాలని పనులు త్వరగా  పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో కొడంగల్ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ యన్ వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, డీఈఈ విజయ్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, తహసీల్దార్ మమత తదితరులు పాల్గొన్నారు.

Share This Post