హలియా, పెద్ద వూర,నందికొండ, మే 11.నాగార్జున సాగర్ నియోజక వర్గం లోని హాలియా,నంది కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల శంఖు స్థాపన ల నిమిత్తం ఈ నెల 14 న రాష్ట్ర ఐ.టి., పురపాలక,పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ల పర్యటన సమాచారం తో హలియా పట్టణం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించారు.బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ , మిర్యాలగూడ అర్.డి. ఓ.ఇతర అధికారులతో కలిసి హాలియా- మిర్యాలగూడ రహదారిలో హెలిపాడ్ ఏర్పాట్లు పరిశీలించారు.హాలియా పట్టణం లో మినీ స్టేడియం లో హాలియా, నంది కొండ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు శంకుస్థాపన ,అక్కడే సభ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.అనంతరం నంది కొండ పట్టణం లో మహత్మా జ్యోతి బా పూలే బి.సి.గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో హెలిపాడ్, పెద్ద వూర మండలం సుంకి శాల గ్రామం లో హెలిపాడ్ ఏర్పాటు కు స్థల పరిశీలన, సుంకి శాల నుండి నాగార్జున సాగర్ రిజర్వాయర్ ద్వారా కృష్ణా మంచి నీటి పథకం కింద హైద్రాబాద్ పట్టణంకు కృష్ణా జలాలు సరఫరాకు ఇంటేక్ వెల్ స్టేషన్ నిర్మాణ పనులు శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించారు.జిల్లా కలెక్టర్ వెంట అర్.డి. ఓ.మిర్యాలగూడ రోహిత్ సింగ్,అర్&బి ఈ ఈ నరేందర్ రెడ్డి,రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రాం చంద్ర నాయక్,హాలియా మున్సిపల్ కమిషనర్ వేమా రెడ్డి, హాలీయా తహశీల్దార్ మంగ, తదితరులు పాల్గొన్నారు
