రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా
జాతీయస్థాయి పురస్కారం అందుకున్న
ZPP చైర్మన్, ZPPCEO, DPO
– అభినందించిన రాష్ట్ర మంత్రి శ్రీ కేటిఆర్
——————————
దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి న్యాలకొండ అరుణా, వైస్ చైర్మన్ శ్రీసిద్ధం వేణు , DPO రవీందర్ లు మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా ఆదివారం అందుకున్నారు.
ఆదివారం జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ భవనంలో నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా
ఉత్తమ జెడ్పీ అవార్డు ను
జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి న్యాలకొండ అరుణా, వైస్ చైర్మన్ శ్రీసిద్ధం వేణు, మండలాల జడ్పీటిసీ సభ్యులు , జడ్పీ కోఆప్షన్ సభ్యులు, జడ్పీ సీఈఓ శ్రీ గౌతమ్ రెడ్డి లు అందుకున్నారు.
అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు
మద్దికుంట ( ముస్తాబాద్ మండలం) , మండేపల్లి ( తంగల్ల పల్లి మండలం) అవార్డులను జిల్లా పంచాయితీ అధికారి శ్రీ రవీందర్ , స్థానిక సర్పంచ్ లతో కలిసి స్వీకరించారు.
అనంతరం వారు హైదరబాద్ లో రాష్ట్ర ఐటి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కే తారక రామారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి శ్రీ కే టి ఆర్ వారిని సన్మానించి అభినందించారు.
*నేపథ్యం ఇదే:*
జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ఏటా దీన్ దయాళ్ పంచాయత్ సశక్తి కరణ్ పేరిట ఇచ్చే అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మూడు అవార్డులను ఇటీవలే చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
2020–21 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులు–2022 కింద
ఉత్తమ జెడ్పీ అవార్డు తో పాటు
ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు
మద్దికుంట ( ముస్తాబాద్ మండలం) , మండేపల్లి ( తంగల్ల పల్లి మండలం)
జిల్లా కు లభించాయి.
——————————