రాష్ట్ర పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించాలి ….. జిల్లా టూరిజం అధికారి శివాజీ

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -03:

రాష్ట్ర పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించాలని జిల్లా టూరిజం అధికారి శివాజీ నేడోక ప్రకటనలో తెలిపారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని,
1. ఎక్సలెన్స్ ఇన్ రైటింగ్/ పబ్లికెషన్
2.బెస్ట్ ఫిల్మ్ ఆన్ తెలంగాణ టూరిజం,హెరిటేజ్
3.ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు
4. క్లాసిఫైడ్ హోటల్స్
5.బెస్ట్ వే సైడ్ అమునిటీస్
6.బెస్ట్ హరిత హోటల్స్
7.బెస్ట్ థీమ్ బేస్డ్ రిసార్ట్స్
8.బెస్ట్ రెస్టారెంట్స్
9.బెస్ట్ టూరిజం గైడ్
10.బెస్ట్ సివిక్ మేనేజ్ మెంట్
11.బెస్ట్ రూరల్ టూరిజం ప్రాజెక్ట్
12.బెస్ట్ కన్వెన్షన్ సెంటర్
13.బెస్ట్ హోం స్టే
14.బెస్ట్ టూరిజం ఇన్స్టిట్యూట్
విభాగాల్లో దరఖాస్తులు సమర్పించాలని, అర్హత గలిగిన వారు ఈ నెల 30 లోగా దరఖాస్తులను అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్ 9440816065,. 9440816068 లలో సంప్రదించాలని, దరఖాస్తులను కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణా,
3-5-891, టూరిజం హౌజ్, హిమాయత్ నగర్
హైదరాబాద్ కు పంపాలని శివాజీ ఆ ప్రకటనలో కోరారు.

Share This Post