రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐ.టి శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, శాసనసభ్యులు క్రాంతి కిరణ్ లతో గురువారం సమాచార భవన్ లో భేటీ అయ్యారు.

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐ.టి శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, శాసనసభ్యులు క్రాంతి కిరణ్ లతో గురువారం సమాచార భవన్ లో భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూల ప్రభుత్వమని, జర్నలిస్టుల సంక్షేమ నిధితో కరోనా వచ్చిన జర్నలిస్టులకు అండగా నిలబడిన ప్రభుత్వమని జర్నలిస్టులకు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని ఈ భేటీలో కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు, చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి వారు తీసుకువచ్చారు. కోవిడ్ మహమ్మారి వలన కొంత మంది జర్నలిస్టులను పోగొట్టుకున్నామని, అంతే కాకుండా ఆర్ధికంగా పలు పత్రికలు ఇబ్బందులకు గురవుతున్నాయని వారు తెలిపారు. ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు అంధోల్ శాసన సభ్యులు క్రాంతి కిరణ్ కమీషనర్ కు ఈ విషయాలు వివరించారు. సమాచార శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఇతర అంశాలపై సానుకూలంగా స్పందించారు. చిన్న పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ జారీకి సంబంధించిన సమస్యలపై స్పందిస్తూ ఈ నెల నుంచే చిన్న పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లను విడుదల చేస్తామని చెప్పారు. ఈ యేడాదికి నిర్ధేశిత లక్ష్యం కోసం ప్రత్యేకంగా చిన్న పత్రికల ప్రకటనల కోసం నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ముఖ్యంగా జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించి కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, అందులో భాగంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులను జారీ చేసిందన్నారు. ఈ హెల్త్ కార్డుతో జర్నలిస్టులు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందే అవకాశముందన్నారు.

జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల విషయమై మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని, కార్డుల పొడగింపు గడవు ముగిసేలోపు ఫిబ్రవరిలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించి అర్హులైన అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎంపాన్నెల్డ్ చిన్న మరియు మధ్య తరహా పత్రికా అసోసియేషన్  తరపున చిన్న, మధ్యతరహా వార్తా పత్రికల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ బిజిగిరి శ్రీనివాస్, కో- కన్వీనర్ సిరికొండ ఆగస్టిన్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ జనరల్ సెక్రెటరీ రమణకుమార్ వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు.

ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్లు నాగయ్య కాంబ్లే, ఎల్.ఎల్.ఆర్‌. కిశోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ డి. ఎస్. జగన్, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, డి. శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. యామిని, అక్కౌంట్స్ ఆఫిసర్ శౌరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post