రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ శుక్రవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ శుక్రవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి, తూప్రాన్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహకులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నిర్దేశిత అంచనా లక్ష్యానికి చేరువలో ఉంచటంలో, ధాన్యం సేకరణ పూర్తి చేయటంలో అధికారులు సఫలీకృతులు అయినందుకు జిల్లా అధికారుల బృందాన్ని అభినందించారు. వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు,కొనుగోలు కేంద్ర నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని,మిగిలిన ధాన్యాన్ని వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 2,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యిందని, మిగిలిన ధాన్యాన్ని వారం లోపే కొనుగోలు పూర్తి చేసి మిల్లులకి తరలించాలని అనిల్ కుమార్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీ వెంటవెంటనే పూర్తి చేసి రైతులకు చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు.
అనంతరం జిల్లాలో సి‌ఎం‌ఆర్ బియ్యం డెలివరీ పురోగతి పై తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2020-21 బియ్యం డెలివేరి లో మిగిలిన 16 వేల మెట్రిక్ టన్నులను వారం లోపు పూర్తిచేయుటకు కార్యాచరణ రూపొందించుకొని అందుకనుగుణంగా పనులను వేగం చేస్తూ వారంలోగా పెండింగ్ బియ్యన్ని ఎఫ్‌సి‌ఐకి అప్పగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లాలో తూప్రాన్, మనోహరాబాద్ లలో కొత్తగా రైల్వే లైన్ వచ్చిన దృష్ట్యా బియ్యం లోడింగ్ పాయింట్, బియ్యం సేకరణకు అనుగునంగా ఎఫ్‌సి‌ఐ అధికారులకు సూచనలు తెలియజేయాలని అధికారులు జిల్లా పౌర సరఫరాల కమిషనర్ కు ప్రతిపాదనలు సమర్పించగా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రారంభం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లయిస్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, జిల్లా మేనేజర్ సాయిరామ్, రెవెన్యూ తూప్రాన్ ఆర్డిఓ శ్యామ్ ప్రకాష్ ,జిల్లా అధికారులు,సొసైటి ప్రెసిడెంట్లు కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు పాల్గొన్నారు.

Share This Post