రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు – రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

ప్రచురణార్ధం

• రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

• ఈ ఏడాది ఇబ్బందులు తొలగి, కొత్త సంవత్సరం శుభాలు, సంతోషాలు అందించాలి

• కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసిఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడని రాష్ట్ర ప్రభుత్వం

• రానున్న ఏడాది 2022లో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం

• మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి శ్రీమ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్ గారు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

2021 సంవ‌త్స‌రంలో క‌రోనా, ఎమిక్రాన్ వైర‌స్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, గిరిజ‌న బిడ్డ‌లు, విద్యార్థుల‌కు విద్య, ఉపాధి పరంగా తీరని నష్టం కలిగిందని అన్నారు. వీట‌న్నింటిని అధిగ‌మిస్తూ రానున్న సంవ‌త్స‌రం మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తూ 2022కి స్వాగ‌తం పలికారు.

2021 సంవ‌త్స‌రంలో కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడా రాజీ పడకుండా అనేక ప్రజోపయోగ పనులు చేశాం అన్నారు. రానున్న కొత్త సంవ‌త్స‌రంలో మ‌రిన్ని ఎక్కువ ప‌నులు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబెడతామన్నారు.

కరోనా, ఏమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post