రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిచే ఫిబ్రవరి 5న నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం …… ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు

ప్రచురణార్థం

రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిచే ఫిబ్రవరి 5న నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం …… ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు

—————————–
పెద్దపల్లి, ఫిబ్రవరి -03:
—————————–
ఫిబ్రవరి 5న ఉదయం 11-30 గంటలకు నంది మేడారం లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఉజ్జల్ భూయన్ గారు ప్రారంభిస్తారని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు నేడోక ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 5 న ఉదయం 11-30 గంటలకు ధర్మారం మండలంలోని నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఉజ్జల్ భూయన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని , ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హై కోర్ట్ జడ్జ్ లు జస్టిస్ శ్రీ పి.నవీన్ రావు, శ్రీ ఎన్.వి. శ్రవణ్ కుమార్ లతో ఇతర హైకోర్టు జడ్జీలు పాల్గొంటారని ఎం.నాగరాజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆ ప్రకటనలో తెలిపారు.
—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post