రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పల్లె ప్రగతిని చేపట్టిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పల్లె ప్రగతిని చేపట్టిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

శుక్రవారం ప్రారంభమైన 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా
సదాశివపేట మండలం మద్దికుంట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి పల్లె ప్రకృతి వనం, నర్సరీనీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం పనుల పురోగతిని పరిశీలించారు.

నర్సరీ లో మొక్కల ఎదుగుదల, పల్లె ప్రకృతి వనం ఆహ్లాద కరంగా ఉందని కలెక్టర్ సంతృప్తినీ వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణం పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎంపీడీవో, సర్పంచ్ కు సూచించారు.

క్రీడా ప్రాంగణంకు సంబంధించిన మెటీరియల్ మొత్తం వచ్చిందన్నారు. క్రీడాకారులకు ఇవ్వనున్న టి షర్ట్స్ ను ఆయన పరిశీలించారు.

15 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతిలో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.

గ్రామంలో ప్రతిరోజు తడి, పొడి చేత్త వేరు చేసి , చెత్తను dumpyard కి తరలించి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నది లేనిది సర్పంచ్ ను, పంచాయతీ సెక్రటరీనీ ఆరా తీశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు. రోజు మురికి కాలువలు పరిశుభ్రం చేయాలని, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తల వహించాలన్నారు.

తడి పొడి చెత్తను వేరు చేసి డంప్ యార్డ్ కు తరలించి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నట్లు సర్పంచ్ కలెక్టర్కు వివరించారు. గ్రామ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, పల్లె ప్రగతి లో నిర్దేశించిన ఆయా పనులను నిరంతరంగా కొనసాగిస్తున్నామని పంచాయతీ సెక్రెటరీ చెప్పారు.

ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లూ కలెక్టర్ తెలిపారు.

ఖాళీ స్థలాలలో, వైకుంఠ దామల వద్ద, డంపు యార్డ్ ల వద్ద మొక్కలు నాటి గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చాలన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి సునీత, ఎంపీడీవో పూజ, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏ పీ ఓ, ఏ పీ ఎం, తదితరులు పాల్గొన్నారు.

Share This Post