రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 30 (శనివారం). రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, ల్యాప్టాప్ లు, అంగన్వాడి టీచర్లకు ఆయాలకు స్మార్ట్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమoపై పూర్తి చిత్తశుద్ధితో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు 19 లక్షల రూపాయల విలువైన దివ్యాంగుల సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని అదేవిధంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు చాలా ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ లను రాష్ట్రంలోనే ప్రథమంగా అందిస్తున్నామని ఆ స్మార్ట్ ఫోన్ లో మీ పరిధిలో గల చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలను 100% పొందుపరచాలని అన్నారు. త్వరలోనే హైదరాబాద్లో దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ సహాయ పరికరాల పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనుందని తెలిపారు. అంగన్వాడి టీచర్లకు కరోనా ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అంగన్వాడి టీచర్లకు అరవై రెండు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి రిటైర్మెంట్ తర్వాత కూడా పింఛన్ అందించడం లేదా ఇతర ఆర్థికసహాయం అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ ఎంత బీసీగా ఉన్నా మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని, జిల్లాలో 6000 మంది దివ్యంగులున్నారని వారందరికీ ప్రభుత పథకాలను అందించడంలో జిల్లా అధికార యంత్రాంగం కృషిచేస్తుందని, స్మార్ట్ ఫోన్ లు అంగన్వాడీ టీచర్స్, ఆయాలు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. స్థానిక శాశన సభ్యులు గండ్రా వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరికి సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత సంకల్పం దానిలో భాగంగా దివ్యంగులకు సహాయ ఉపకారణాలపంపిణి చెయ్యడం జరుగుతుంది. కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్స్ బాలలు, గర్భిణీలు, బాలింతలఇంటింటికి తిరిగి పౌష్టికహరo అందించారు. అంగన్వాడీలను తిరిగి తెరిచి బాలలు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికహారం అందిస్తున్నాము. కరోనా మన దరిచేరకూడదంటే అందరు కరోనా వ్యాక్షిన్ వేసుకోవాలనారు. ఈ సందర్బంగా దివ్యాంగులకు motorized త్రి విలర్స్ వెహికల్స్ 12, బ్యాటరీ వీల్ చైర్స్ 6, లాప్టాప్స్ 2, హియరింగ్ ఎయిడ్స్ 9, అంగన్వాడి టీచర్లకు అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్స్670 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర, మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గం వెంకటరాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేష్ నాయక్, ఎంపీపీ మండల లావణ్య,జెడ్పిటిసిలు, ఎంపిపిలు, జిల్లా సంక్షేమ అధికారి కె. సామ్యూల్, సిడిపివోలు, అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది

Share This Post