పత్రికా ప్రకటన తేది 09 -12-2021
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితాహారం కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.
గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో హరితాహారం పై సమీక్షా సమావేశం నిరహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2021 సంవత్సరం లో మీకున్న లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. వచ్చే సంవత్సరం హరిత హారంలో వివిధ శాఖల ద్వారా నాటవలసిన మొక్కల లక్ష్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాటిన మొక్కల వివరాలను ఎఫ్ ఎం ఐ ఎస్ పోర్టల్ లో అప్ డేట్ చేయాలనీ తెలిపారు. ఎవేన్యు ప్లాంటేషన్ చేయాలనీ, పట్టాణ ప్రకృతి వనాలో ప్లాంటేషన్ చేయాల్సి ఉంటే పూర్తి చేయాలనీ అన్నారు. డి ఆర్ డి ఏ, వ్యవసాయ, చేనేత, ఉద్యానవన ,అటవీ శాఖ వారు మీకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం లక్ష్యం వివరాలను సిధంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ బిల్డింగ్ లలో ఉన్న అంగన్వాడి సెంటర్ల కిచెన్ గార్డెన్ లలో ఎక్కువ మొక్కలు నటాలని ఐ సిడిఎస్ అధికారికి ఆదేశించారు. శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను వచ్చే సంవత్సరం ఎక్కడ నాటుతారు ఏ సైట్ లో ఎన్ని మొక్కలు వస్తాయి అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సమావేశం లో జల అదనపు కలెక్టర్ శ్రీహర్ష, , డి.ఎఫ్.ఓ రామ కృష్ణ, డి ఆర్ డి ఏ ఉమాదేవి, జాడ్ పి సి ఇ ఓ విజయనయాక్, ముసాయిదా బేగం, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.