రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలి – రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ కమిషనర్ శరత్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ కమిషనర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమ పర్యవేక్షణకు నాగర్ కర్నూల్ జిల్లా వెలదండ మండలం కోట్రా గ్రామంలో సందర్శించారు. గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి రికార్డులను పరిశీలించి రికార్డులను సక్రమంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలని ఆదేశించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని పరిశీలించి మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోయించాలని ఆదేశించారు. హరితహారం లో ఎవెన్యూ ప్లాంటేషన్ బాగా పెంచుకోవాలని మూడు వరుసల్లో మొక్కలు కనిపించాలని మొదటి వరుసలో పూల మొక్కలు రెండవ వరుసలో పండ్ల చెట్లు ఇతర చెట్లు మూడవ వరుసలో పెద్ద చెట్లు ఉండేవిధంగా చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కమిషనర్ కు స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను కలెక్టర్ కమిషనర్ కు వివరించారు.
అదనపు కలెక్టర్ మను చౌదరి, డీపీఓ కృష్ణ, పి.డి.డిఆర్డీఏ నర్సింగ్ రావు, జడ్పి సీఈఓ ఉషా, డిఎల్పీఓ పండరీనాథ్, ఎంపిడిఓ లు, సర్పంచు పాల్గొన్నారు.

Share This Post