వరంగల్
ప్రచురునార్ధం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేదింటి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతోందని కలెక్టర్ డాక్టర్ బి . గోపి అన్నారు
జిల్లా లోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కోసం కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం కలెక్టర్ డాక్టర్ బి. గోపి ప్రారంభించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు కళ్ళ ప్రాధాన్యత ప్రతీ ఒక్కరికి తెలుసు అని… ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకోవడం లో నిర్లక్ష్యం వహించారాదన్నారు
కంటి సమస్య లు ఉన్న వివిధ కారణాల వల్ల అప్పటికప్పుడు ఆసుపత్రి కి వెళ్లి చూపించుకోవడం పట్ల నిర్లక్ష్యం గా వ్యవహారిస్తామన్నారు
ఈ నేపథ్యంలో ఉద్యోగుల కోసం
ప్రత్యేకంగా కలెక్టరేట్ లో కూడా కంటి వెలుగు శిబిరాన్ని
ఏర్పాటు చేశామన్నారు
ఉద్యోగస్తులందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు
తాము మాత్రమే కాకుండా వారి వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి కంటి వెలుగు శిబిరం లో పరీక్ష లు చేపించాలని కలెక్టర్ సూచించారు
ఈనాటి శిబిరం లో 204 మంది కి కంటి పరీక్ష లు చేయగా… రీడింగ్ గ్లాస్ లు 78 మందికి, ప్రిస్కిప్షన్ గ్లాస్ లు 71 మందికి ఇచ్చారు
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ, శ్రీ వాత్స, Dmho, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు