రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నతెలంగాణా కు 8వ విడత హరిత హారం కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో సిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు.

 

పత్రిక ప్రకటన                                                                 తేది: 29-4-2022

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నతెలంగాణా కు  8వ విడత హరిత హారం కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో సిద్దంగా ఉండాలని  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు.

శుక్రవారం ఉదయం జిల్లా  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలంగాణకు 8 వ విడత హరితహారం, దళితబంధు, వరి ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా హరితహారం పై ఆయన మాట్లాడుతూ 8వ విడత హరితహారం జులై కంటే ముందే ప్రారంభించి ఆగస్టు మాసం చివరివరకు  పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటేవిధంగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతం, కాలువలు, ప్రక్కన విస్తృతంగా మొక్కలు నాటేవిధంగా చూడాలన్నారు.  పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు గ్రౌండింగ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.    మే, 7వ తేదీలోగా హరితహారం జిల్లా ప్రాణాళిక సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు.

దళితబంధు పథకం పై సమీక్షిస్తూ నియోజకవర్గాల వారిగా మంజూరు అయిన వాటితోపాటు ప్రత్యేక మండలాలను ఎంపిక చేసిన దళితబంధు యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.

వానాకాలం పంట సాగు ప్రణాళిక పై మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించి  శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు.  పెసర్లు వేయడం వల్ల దిగుబడితో పాటు భూమి సారవంతమవుతుందనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  కంది పంట సాగు పెంచాలని రైతులు ఎరువులు మోతాదుకు మించి వాడకుండా అవగాహన కల్పించాలన్నారు.  వరి పంట డైరెక్ట్ సీడ్స్ వేసే విధానం పై అవగాహన కల్పించాలని సూచించారు.  వ్యవసాయ విస్తీర్ణాధికారులు తమ రైతు వేదికలో ఉండి విధులు నిర్వహించేవిధంగా అదేశించి రైతువేదికలను వందశాతం ఉపయోగంలోకి తీసుకురావాలని కలెక్టర్లకు  సూచించారు.

వరి కొనుగోలు పై సమీక్ష నిర్వహిస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచాలని వచ్చిన

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  ధాన్యం కొనుగోలు వివరాలు అదేరోజు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం మన రాష్ట్రం లోకి రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా,   కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలు లేకుండా చూడాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, అటవీ శాఖ అధికారి గోబ్రియాల్, శాంతకుమారి,  ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణా రావు, జిల్లా నుండి ఆదనవు కలెక్టర్ శ్రీహర్ష , డి ఆర్ డి ఓ ఉమాదేవి, డి పి ఓ శ్యాం సుందర్, మునిసిపల్ కమీషనర్  జానకి రామ్ సాగర్, అటవీశాఖ అధికారి రామకృష్ణ ,పంచాయతీ రాజ్ ఇ ఇ  సమత, ఆర్ అండ్ బి అధికారి ప్రగతి  వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, ఈ డి ఎస్సి కార్పొరేషన్ అధికారి రమేష్ బాబు    తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్  గారి  ద్వారా జారీ.చేయబడినది.

 

 

 

Share This Post