రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు.

మన ఊరు- మన బడి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలి

పరిపాలన అనుమతులను వేగవంతంగా ఇవ్వాలి

పనులు నాణ్యతగా ఉండాలి

వ్యయ అంచనాలు సరిగ్గా ఉండాలి

కలెక్టర్ ,అదనపు కలెక్టర్ లు, సీనియర్ అధికారులు రెగ్యులర్ గా విజిట్ చేసి పనులను పరిశీలించాలి

నియోజకవర్గానికి 2 పాఠశాలలు తొందరగా పూర్తి చేసి డాక్యుమెంటేషన్ చేయాలి

…… మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు.

మన ఊరు మన బడి పనుల పురోగతిపై హరీష్ రావు సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పరిపాలన అనుమతులను వేగవంతంగా ఇవ్వాలని, పనుల అంచనాలకు సంబంధించి ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే మంజూరి ఇవ్వాలన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తి కావాలన్నారు. తప్పుడు అంచనాలు వేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో గ్రామ పెద్దలను, విద్యార్థుల తల్లిదండ్రులను పూర్తిగా భాగస్వాములనను చేయాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టిందని తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా తెలియజేయాలన్నారు. విద్యకు సంబంధించి చేపట్టిన ఇట్టి పనులు యజ్ఞంలా కొనసాగాలని అన్నారు. పూర్తయిన పాఠశాలలకు సంబంధించి ట్విట్టర్, ఫేస్ బుక్, సోషల్ మీడియా పత్రికలు, ఛానల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.

30 లక్షల లోపు పనులను స్థానిక ఎస్ఎంసి ద్వారా చేయించాలన్నారు.30 లక్షలకుపైగా గల పనులకు మే చివరి నాటికి అన్ని టెండర్స్ పూర్తి కావాలని స్పష్టం చేశారు. మంజూరి ఇచ్చినవన్నీ గ్రౌండింగ్ కావాలని తెలిపారు.

ప్రతి పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి సంతృప్తి చెందితేనే, మంజూరు ఇవ్వాలని, డబ్బు ఎట్టిపరిస్థితిలోనూ వృధా చేయవద్దని సూచించారు. పనుల ఖర్చుకు సంబంధించిన అంచనాలను మరోమారు పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈనెల 10లోగా పరిపాలన అనుమతులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 2 పాఠశాలలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.వడగాలులు ఎక్కువగా ఉన్నందున, ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షల పై విద్యార్థుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా 441 పాఠశాలలను ఎంపిక చేయగా, ఇప్పటి వరకు 275 పాఠశాలలకు పరిపాలనా మంజూరీ ఇవ్వడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. అందులో 30 లక్షల లోపు 198 పాఠశాలలు ఉన్నాయని, అందులో లో 60 పాఠశాలల గ్రౌండింగ్ కూడా పూర్తయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.138 పాఠశాలలు గ్రౌండింగ్ కు సిద్ధంగా ఉన్నవని తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గంలో రెండు పాఠశాలలను పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డి ఈ ఓ రాజేష్, పంచాయతీ రాజ్ ,ఇరిగేషన్ ,ఆర్ అండ్ బి, తదితర శాఖల ఈ ఈ లు,డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post