రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె పి.సి.వి వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం పిల్లలందరికీ వ్యాక్సిన్ అందే విదంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా వైద్యాదికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                        తేది 11-08-2021

        రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె పి.సి.వి వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం  పిల్లలందరికీ వ్యాక్సిన్ అందే విదంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా వైద్యాదికారులకు ఆదేశించారు.  

      బుధవారం కల్లెక్టరేట్ సమావేశం  హాలు నందు వైద్యాధికారుల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ సంవత్సరం లోపు పిల్లలు  న్యుమోనియా , మోనింజైటిస్, బాక్టీరియా, సేప్సిస్ మరియు బ్రాంకైటిస్  వ్యాదుల బారిన పడకుండా పి.సి.వి వ్యాక్సిన్ ను వేయడానికి జిల్లా అధికారులు అందరు సమన్వయము తో కృషి చేయాలనీ అన్నారు. వ్యాక్సిన్ గురించి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పై వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని  అన్నారు.  సంవత్సర లోపు పిల్లల  మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం   పి సి వి వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి తెస్తునట్లు తెలిపారు.చిన్న పిల్లలు న్యుమోనియా వ్యాది బారిన పడకుండా   గ్రామాలలో పరిసరాలు శుబ్రంగా ఉంచుకునేలా  ప్రజలకు అవగాహన కల్పించే విదంగా ఏర్పాట్లు చేయాలనీ పంచాయతి అధికారికి ఆదేశించారు. పి సివి వ్యాక్సిన్ గురించి మీడియా ద్వారా ప్రచారం చేయాలనీ తెలిపారు.    ఏ ఎన్ ఎం లు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు తయారు చేసిన   ఆరు నెలల వయసున్న పిల్లల లిస్టు ప్రకారం 100 శాతం వ్యాక్సిన్ పిలలకు  అందేలా చూడాలని అన్నారు.

 మొదటి డోస్  1 ½ నెలలు ( ఆరు వారాలు) , రెండవ డోస్ 3 ½ (14 వారాలు) , బూస్టర్ డోస్ 9 నెలలు నిండిన తర్వాత వేస్తామని జిల్లా వైద్యాధికారి తెలిపారు. జిల్లాకు 1000 డోస్ లు వచ్చాయని జిల్లా వ్యాక్సిన్ స్టోర్ లో బధ్రపరచామని , రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు వ్యాక్సిన్ ను జిల్లా లో ప్రవేశ పెడతామని తెలిపారు.

పి సి వి వ్యాక్సిన్ పై ఎన్ ఎస్ ఎం ఓ మహమ్మద్ అసర్ పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం పొగాకు ఉత్పత్తులను నియంత్రిస్తూ బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగాటాన్నినిషేదించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా తెలిపారు.  
జాతీయ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడటం వల్ల క్యాన్సర్, కంటి చూపు తదితర సమస్యలు ఏర్పడతాయని అన్నారు.పొగాకు వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పై బీడీ కార్మికులకు అవగాహన కలిపించాలని, వారిఅరోగ్యం పై తగిన జాగ్రతలు తీసుకునే విదంగా చర్యలు తీసుకోవాలని  లేబర్ అధికారికి ఆదేశించారు.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెక్షన్ 6 ప్రకారం 18 ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని, విక్రయించిన వారికి జరిమానా విధించాలని అన్నారు. సెక్షన్ 4  ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే జరిమానా విధించాలనిఅధికారులకు ఆదేశించారు.  సెక్షన్ 5 ప్రకారం పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేస్తే వేయి రూపాయలు జరిమానా ఉంటుందని తెలిపారు.  సెక్షన్ 6  ప్రకారం విద్యాలయాలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించ రాదని, ఆవిదంగా చేస్తే జరిమానాతో పాటు శిక్ష ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో  జిల్లా వైద్య అధికారి చందునయాక్ ,  డి ఆర్ డి ఓ ఉమా దేవి, డి పి ఓ ,శ్యాం సుందర్, శిశు సంక్షేమ అధికారి ముశాయిధ బేగం, డాక్టర్ శశి కళ , శౌజన్య, సంబదిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-   

  జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post