రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పై నాడు నేడు పై చర్చ జరగాలి.

రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పై  నాడు నేడు పై చర్చ జరగాలి.

ప్రచురణార్థం

మహబూబాబాద్ మే 29.

గత ప్రభుత్వాలు ప్రజలకు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్ది కాలంలో చేపట్టిన అభివృద్ధిపై గ్రామస్థాయిలో చర్చ జరగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

సోమవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ లు ప్రజా ప్రతినిధులతో కలిసి 2014 నుండి 2023 వరకు చేపట్టిన అభివృద్ధిపై జూన్ రెండవ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి వేగవంతంగా జరిగిందన్నది వాస్తవమన్నారు.

ఈ విషయాన్ని ప్రజల్లో అవగాహనపరిచేందుకు దశాబ్ది ఉత్సవాలు చేపట్టడం జరిగిందన్నారు.
విద్యుత్ రంగంపై మాట్లాడుతూ రైతాంగానికి నాడు 9 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా జరిగేదని అది కూడా నాణ్యతలేమితో లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవని రైతులు చనిపోయేవారని నేడా పరిస్థితి లేదన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును రైతాంగానికి అందిస్తున్నామన్నారు రైతులు చనిపోవటం గాని పంట నష్టపోవటం కానీ లేదన్నారు. విద్యుత్తు కై రైతాంగం పట్ల ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

సాగునీటిపై మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి వనరులు ఉన్న వినియోగించుకునే అవకాశం లేక నాడు వంటలు ఎండిపోయేవని నేడు కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ కాలువలు ద్వారా మండు వేసవిలో కూడా చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయని, గ్రామాలలో భూగర్భ జలాలు పెరిగాయని ఒక్క పంట పండించుకునే రైతులు రెండు పంటలు పండించుకుంటూ బీడు బంజరు భూములు సైతం సాగునీటి సౌకర్యంతో పచ్చని మెట్ట భూములుగా మాగాణి భూములుగా తలపిస్తూ సిరిసంపదలను కురిపిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు అంతేగాక వాగులపై తన నియోజకవర్గంలోని తొర్రూరులో 10 చెక్ డ్యాం లు నిర్మించడం జరిగిందన్నారు.

రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో 70 వేల ఎకరాల పోడుభూమి పంపిణీకి ఏర్పాట్లు చేపట్టగా జిల్లాలో 20 ఎకరాలు పంపిణీ చేయవలసి ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమం మొదటి సారిగా 69 లో మొదలైన 2001 మలిదశలో కూడా ఉద్యమం పోరాటం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పోరాటాల ఫలిత కారణంగానే సంక్షేమ ఫలాలను మనమే నాడు సమృద్ధిగా పొందగలుగుతున్నామన్నది నేటి తరానికి తెలియాలన్నదే ముఖ్య ఉద్దేశం గా పేర్కొన్నారు.
దశాబ్ది ఉత్సవాలలో చేపట్టే కార్యక్రమాలు పండుగలా చేపట్టాలని సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు.

నాడు త్రాగునీటి కోసం అల్లాడిపోయే వారమని రోడ్లపై ధర్నాలకు దిగేవారమని మిషన్ భగీరథ తో ప్రతి ఇంటింటికి త్రాగునీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు ఇది నేడు సాధించిన విజయం కాదా అని ప్రశ్నించారు.

అంగన్వాడి సిబ్బందికి లబ్ధితో కూడిన పదవి కాలాన్ని తెలియ స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు
మహిళా శిశు సంక్షేమం లో భాగంగా రాష్ట్రంలోని 4వేల మినీ అంగన్వాడి కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడం జరిగిందని చెప్పారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ… జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు చేపట్టే ప్రతి కార్యక్రమం అందుకు పండుగ వాతావరణంలో చేపడతామన్నారు.

నియోజకవర్గ శాసనసభ్యుల సహకారం తీసుకుంటామని ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా అధికారులు సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, డేవిడ్ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్లు పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, రామచంద్రయ్య జెడ్పిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Share This Post