రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్,3 నుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల…

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్,3 నుండి 18 వరకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేసారు.

బుధవారం కలెక్టర్ కార్యక్రమం లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి పల్లెప్రగతి కార్యక్రమంపై ఎంపీడీఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలతో వెంటనే ముందస్తు సన్నాహక సమావేశాలు నిర్వహించి గ్రామాలలో నిర్వహించాల్సిన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్, పారిశుధ్యం, నీటి సమస్యల పరిష్కారం, వాటర్ ట్యాంక్ ల పరిశుభ్రత, నిరూపయోగంగా ఉన్న బావులు, గుంతలు,బోర్ గుంతలను పూడ్చివేయడం, శితిలావస్థలో ఉన్న పాత ఇండ్లను తొలగించడం, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు సందర్శించి అక్కడి సమస్యలు పరికరించడం, వైకుంఠదామాలలో విద్యుత్ సౌకర్యాలు, మిషన్ భగీరథ నీటి సదుపాయాలు కల్పించాలి, వైకుంఠ దామాలు వినియోగం లోకి వచ్చేటట్లు చర్యలు చేపట్టాలి, గ్రామాలలో మురుగు నీరు నిలువకుండ చూడాలి అవసరమైన స్థలాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్ సి లు, గ్రామ పంచాయతీ లలో గల పిచ్చి మొక్కలను తొలగించాలి, హరితహారం కు సంబందించి రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ కొరకు గుంతలు త్రవ్వే పనులు చేపట్టాలి, క్రీడా ప్రాంగణలలో మొక్కలు నాటేందుకు కూడా గుంతలు త్రవ్వే పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో ప్రజలందరికి చేపట్టే పనులపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు దండోరా వేయించాలన్నారు. ప్రజలు బహిరంగ మల విసర్జన చేయకుండా ఉదయం పూట గస్తీ తిరిగి నిరోధించాలన్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వినియోగించుకొనేలా చూడాలన్నారు. క్రీడా ప్రాంగనాలను ఈ నెల 17 వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవం కొరకు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులతో పాటు గ్రామాలలో ఇతర సమస్యలను గుర్తించి పల్లె ప్రగతి అనంతరం కూడా పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో వంగిపోయిన విద్యుత్ స్థంబాలను తొలగించి కొత్త స్థంబాలు ఏర్పాటు, వ్రేలాడుతున్న విద్యుత్ తీగలను సారి చేసే పనులు చేపట్టాలన్నారు. గ్రామీణ కమిటీలు చురుకుగా చేసే విధంగా చూడాలన్నారు.పల్లె ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశంచిన పనులను వంద శాంతం పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలలో నిరూపయోగంగా ఉన్న పాత ఇండ్లను కూల్చివేయాలని, మిషన్ భగీరథ పైప్ లీకేజీలను వెంటనే పరిష్కరించాలన్నారు. వాటర్ ట్యాంకులను నెలకు మూడు సార్లు పరిశుభ్రం చేయాలన్నారు. జిల్లాను ODF గా డిక్లేర్ చేసినప్పటికైని చాలా మంది బహిరంగ మల విసర్జన చేస్తున్నారని దీనిని వంద శాంతం పరిష్కరించాలన్నారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలకు సంబంధించిన బిల్లులు పెండింగ్ గా ఉన్నాయని అధికారులు ఇట్టి బిల్లులను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రగతిలో అధికారులు వార్డులలో ఉదయం 9:00 గంటల లోపు ఉండాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డి ఆర్ డి ఓ కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, పంచాయతీ రాజ్ ఇ ఇ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఇ ఆంజనేయులు, ఇ ఇ బాబు శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post