రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 124 మంది వి.ఆర్.ఓ లకు అత్యంత పారదర్శకంగా వివిధ శాఖలకు కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డి హరిచందన అన్నారు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 124 మంది వి.ఆర్.ఓ లకు అత్యంత పారదర్శకంగా  వివిధ శాఖలకు కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డి హరిచందన  అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమక్షంలో వీడియో కవరేజ్ చేయిస్తూ లక్కీ డీప్ ద్వారా వి.ఆర్.ఓ లకు శాఖల కేటాయింపులు జరిగాయి.  జిల్లాలోని వివిధ శాఖలలో  ఖాళీల భర్తీ కై  ప్రభుత్వం ద్వారా సిఫారసు చేయగా జిల్లాలోని మొత్తం 124  మంది వి.ఆర్.ఓ లకు లక్కీ డీప్ ద్వారా శాఖల కేటాయింపు చేసినట్లు తెలిపారు.  కేటాయింపు జరిగిన వి.ఆర్.ఓ లకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెంటనే వారికి కేటాయించిన శాఖల ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా యస్పి యన్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ పద్మజ రాణి,ఆర్.డి.ఓ , జిల్లా అధికారులు, ఏ.ఓ. నర్సింగ్ రావ్  తదితరులు పాల్గొన్నారు.

Share This Post