రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 167 మంది వి.ఆర్.ఓ లకు అత్యంత పారదర్శకంగా వివిధ శాఖలకు కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 167 మంది వి.ఆర్.ఓ లకు అత్యంత పారదర్శకంగా  వివిధ శాఖలకు కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమక్షంలో వీడియో కవరేజ్ చేయిస్తూ లక్కీ డీప్ ద్వారా వి.ఆర్.ఓ లకు శాఖల కేటాయింపులు జరిగాయి.  జిల్లాలోని వివిధ శాఖలలో 175 ఖాళీలు గుర్తించి ప్రభుత్వం ద్వారా సిఫారసు చేయగా జిల్లాలోని మొత్తం 167 మంది వి.ఆర్.ఓ లకు లక్కీ డీప్ ద్వారా శాఖల కేటాయింపు చేసినట్లు తెలిపారు.  కేటాయింపు జరిగిన వి.ఆర్.ఓ లకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెంటనే వారికి కేటాయించిన శాఖల ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ మోతిలాల్ నాయక్, ఆర్.డి.ఓ లు, జిల్లా అధికారులు, ఏ.ఓ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post