రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులకు లాటరీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక కార్యక్రమాన్నీ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు.

శనివారం హైదరాబాద్ నగరంలోని అంబర్ పెట్ లో గల మహారణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో హైదరాబాద్ రెవిన్యూ లోని సికింద్రాబాద్ జిల్లా కు రఘునందన్ రావు సెక్రటరీ అగ్రికల్చర్ మరియు హైద్రాబాద్ కు జిల్లా కలెక్టర్ శర్మన్ ముఖ్య అతిధులుగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు.

            ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిగా పారదర్శకతతో మద్యం దుకాణాల ల్యాటరీని నిర్వహించామని, హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మొత్తం 179 షాపులు ఉన్నాయని, అయితే  వీటిలో ఒక షాపుకు మాత్రం ల్యాటరీ తీయటం లేదని, దానికి దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటి లక్కీ డ్రా ను నిలిపి వేయడం జరిగిందనిప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత దీనికి  కూడా  లక్కీ డీప్ తీస్తామని, అందువల్ల ఈ షాపుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమ్యూనిటీలో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని  కలెక్టర్ గుర్తు చేస్తూ వాటన్నింటికి కలిపి శనివారం లక్కీ డ్రా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని మద్యం షాపులను ఏలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.

            శ్రీనివాస రావు, నవీన్ కుమార్, శ్రీనివాస మూర్తి, పవన్ కుమార్ ఎక్సయిజ్ సూపెరింటెండెంట్లు మరియు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.

????????????????????????????????????
????????????????????????????????????

Share This Post