రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో … సిద్ధిపేట గొల్లభామ చీరలకు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ

[3:30 pm, 07/08/2021] Dasharatham M: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో …
సిద్ధిపేట గొల్లభామ చీరలకు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ
స్వాతంత్య , గణతంత్ర్య దినోత్సవాల్లో మనమంతా చేనేత వస్త్రాలు ధరించి పాల్గొందాం
——————————
సిద్దిపేట 07, ఆగస్ట్ 2021:
——————————-

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేత‌న్న‌ల‌కు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు లభించడంతో పాటు సిద్ధిపేట గొల్లభామ చీరలకు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు దక్కడంతో పాటు , డిమాండ్ వచ్చిందని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ పేర్కొన్నారు .

శనివారం సిద్ధిపేట పట్టణం విపంచి ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మహాజ‌రై ప్ర‌సంగించారు.
దేశంలో చేనేత కార్మికులను గౌరవించటానికి , భారతదేశం యొక్క చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచటానికి ఏటా ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు .
తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి దన్నారు . బతుకమ్మ చీరలు,చేనేత మిత్ర కింద నూలు, ర‌సాయ‌నాలు, రంగుల‌ను 50 శాతం స‌బ్సిడీతో కార్మికుల‌కు చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా నిస్తుందన్నారు . నేతన్నల తో పాటు అన్ని కులవృత్తులకు జీవం పొస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టి సఫలీకృతం అయ్యిందన్నారు కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చే నేత క‌ళాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్నా , చేనేత కార్మికుల సంక్షేమ కోసం పెద్ద ఎత్తున బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించిదన్నారు ..

మన తెలంగాణ ప్రభుత్వం చేనేతకు పెద్ద పీట వేస్తుందని, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు రైతులకు రైతు భీమా ఎలాగైతే ఇస్తున్నారో అదే విధంగా నేతన్నల కు నేతన్న భీమా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సన్మాన కార్యకమాలలో చేనేత వస్త్రాల తో సత్కరించే సంప్రదాయం కు శ్రీకారం చుట్టారని అన్నారు . చేనేత వస్త్రాల విషయంలో మహాత్మాగాంధీ ని అందరూ స్ఫూర్తి గా తీసుకోవాలన్నారు . అన్ని వినూత్న కార్యక్రమాల కు సిద్ధిపేట వేదికగా నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుందని అదే స్ఫూర్తి తో స్వాతంత్య , గణతంత్ర్య దినోత్సవాల్లో అధికారులు ప్రజలు చేనేత వస్త్రాలు ధరించి పాల్గొనాలన్నారు . అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారంలో ఎదో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించాలని అన్నారు . ఈ విధంగా ప్రోత్సహిస్తే చేనేతకు డిమాండ్ పెరిగి నేతన్నలకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు .
సిద్ధిపేట పురపాలక సంఘం చైర్మన్ శ్రీమతి మంజుల మాట్లాడుతూ .. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి పునర్వైభవానికి కృషి చేస్తుందన్నారు .
అనంతరం సీనియర్ చేనేత కార్మికులు , కళాకారులను సన్మానం చేశారు. చేనేత మిత్ర క్రింద చేనేత సంఘాలకు 25 లక్షల రూపాయల త్రిఫ్ట్ ఫండ్ ను అందించారు .
అంతకుముందు జాతీయ చేనేత దినోత్స‌వ వేడుక‌ల‌ను పురస్కరించుకుని సిద్దిపేట కొత్త బస్టాండ్ నుంచి విపంచి ఆడిటోరియం వరకు నిర్వహించిన చేనేత నడకను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ కొత్త బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు .
కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు శ్రీ వెంకట రమణ ,drdo శ్రీ గోపాల్ రావు లు , చేనేత కార్మికులు పాల్గొన్నారు.
——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్ధిపేట చే జారీ చేయనైనది

Share This Post