రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు – రాష్ట్ర మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు
– రాష్ట్ర మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమ‌న్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం,కేదారీశ్వర వ్ర‌తాలు చేయ‌డం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్ర‌జ‌లంద‌రు పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని, ట‌పాసులు కాల్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని సూచించారు.
——————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post