తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణపై రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్ధేశం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ హాజరై పాల్గొన్నారు. ఈ మేరకు గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జూన్ 2వ తేదీ నుంచి నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ చేయడంతో పాటు దిశానిర్ధేశం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో కార్యదర్శులు, డీజీపీ, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు . ఈ మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.