రాష్ట్ర ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర రావు జిల్లా పర్యటన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన రెవెన్యూ సమావేశంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా అధికారులతో డిసెంబర్ 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్ల పై సమీక్షించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభం ,శిల్పారామం ఆర్చి ప్రారంభం ,ప్రస్తుతమున్న కలెక్టరేట్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, కెసిఆర్ ఏకో అర్బన్ పార్కులో బర్ద్ ఎంక్లోజర్ శంకుస్థాపన, అలాగే బహిరంగ సభకు హాజరవుతున్న దృష్ట్యా ఏర్పాట్ల పై ఆయా శాఖల అధికారులతో పాటు, విధులు కేటాయించిన అధికారులు అందరూ హాజరై ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పనం కాకుండా చూసుకోవాలని ,చివరి వరకు వేచి చూడకుండా ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంగా చేసిన వాగ్దానాల పై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
సోమవారం 96 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు.
ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ప్రజల ఫిర్యాదులను అధికారులు వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ ,జడ్పి సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.